హైదరాబాద్ : విశాలాంధ్ర పత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ మృతి మిడీయా ప్రపంచానికి తీరని లోటని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చిన్న వయస్సులోనే విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేయడం గొప్పవిషయమని పేర్కొన్నారు. బుధవారం ప్రసాద్ సంస్మరణ సభను తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే), విశాలాంధ్ర బృందం అధ్వర్యంలో బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు ఆయన సేవలను గుర్తుకు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి . విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షులు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వైనరేందర్ రెడ్డి, విశాలాంధ్ర పత్రిక తెలంగాణ ఇన్చార్జి రామారావు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.