సీఎం కేసీఆర్ కు అస్వస్థత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎంవో వెల్లడించింది. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. సీఎం కేసీఆర్ గత రెండ్రోజుల నుంచి బలహీనంగా ఉన్నారు. ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారు. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ ఎన్వీ రమణ తెలిపారు.అయితే యాదాద్రిలో నేడు జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ హాజరవుతారని రెండ్రోజుల క్రితమే ఆలయ ఈవో గీత తెలిపారు. కానీ తనకు అస్వస్థత కారణంగా కేసీఆర్ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.