శ్రీవారి సన్నిధిలో పెరుగుతున్న భక్తుల రద్దీ
వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న శ్రీవారిని 65.840 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,135 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీ హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మార్చిలో 19.72 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. సర్వదర్శనం ప్రారంభించిన తర్వాత భక్తులు సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. మార్చి నెలలో హుండీ కానుకల ద్వారా రూ. 128.64 కోట్ల ఆదాయం వచ్చిందని, 9.54 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించారు.