కేప్ టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీంఇండియా 198 పరుగులకు ఆలౌటైంది. 3 గంటలకు పైగా క్రీజులో గడిపిన సారథి విరాట్ కోహ్లీ (143 బంతుల్లో 29) బ్యాట్ తో గొప్ప సంయమనం ప్రదర్శించినా, మిగిలినవాళ్లు కనీస పోరాటం కనబర్చలేకపోయారు. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్ (10) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా, పుజారీ (9), రహానే(1), అశ్విన్ (7), శార్దూల్ (5) విఫలమయ్యారు.
సఫారీ బౌలర్లలో జాన్సెన్ 4, రబడ, ఎంగ్లీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 212 పరగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 101/2 తో నిలిచింది. కీగన్ పీటర్సన్ ( 48 బ్యాటింగ్ ), కెప్టెన్ ఎల్గర్ (30) రాణించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న సఫారీలు విజయానికి ఇంకా 11 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో వికెట్ పడగొట్టారు.
చరిత్రలో ఒకే జట్టుకు చెందిన 20 వికెట్లు క్యాచౌట్ ల ద్వారానే పడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ భారత ఆటగాళ్లంతా క్యాచ్ లు ఇచ్చి ఔటయ్యారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 223
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 210
భారత్ రెండో ఇన్నింగ్స్ : 198 ( పంత్ 100 నాటౌట్ , కోహ్లీ 29, జాన్సెన్ 4/36, ఎంగ్డీ 3/21 )
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 101/2 ( పీటర్సన్ 48 నాటౌట్ , షమీ 1/22 )