వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో వెస్టిండీస్ ను ఓడించి 3-0 తేడాతో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, 265 పరుగులు చేసి వెస్టిండీస్ కు 266 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆ తర్వాత బరిలోకి దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. కేవలం 169 పరుగులే చేయడంతో భారత్ 96 పరుగుల తేడాతో గెలిచింది.
భారత ఆటగాళ్లలో శ్రెయాస్ అయ్యర్ 80 రన్స్ చేసి టీమిండియాకు ఎక్కువ రన్స్ అందించాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 56, దీపక్ చాహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33, కెప్టెన్ రోహిత్ శర్మ 13, శిఖర్ ధావన్ 10 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కృష్ణ చెరో 3 వికెట్లు తీయగా, దీపక్ చాహర్, కుల్ దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు.