భారత్-శ్రీలంక టెస్ట్ : శ్రీలంక టార్గెట్ 447
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : రెండో రోజు ఆట ముగిసింది. ఆ సమయానికి రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 28 /1 తో నిలిచింది. కుశాల్ మెండిస్ ( 16), కరుణరత్నె ( 10 ) నాటౌట్ గా ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. ఇంకా మూడు రోజుల పాటు మిగిలిన ఉన్న ఈ మ్యాచ్ లో మరో 419 రన్స్ చేస్తే శ్రీలంక విజయం సాధిస్తుంది.