25నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

ఇంద్ర‌కీలాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గ‌మ్మ దేవస్థానంలో శార్వరీ నామ సంవత్సర భవానీ మండల దీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. 25 నుంచి 30వ తేదీ వరకు భవానీలకు మాలాధారణ మండల దీక్షలు చేయనున్నారు. 25న ఉదయం 8గంటలకు భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. అలాగే డిసెంబర్ నెలలో అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 17 నుండి 19 వరకు అర్ధమండల మాల ధారణ దీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుండి జ్యోతులు ప్రారంభమవుతాయి. 2021 జనవరి 5 నుంచి 9 వరకు మాల విరమణ మహోత్స‌వం జర‌గనుంది. జనవరి 5న ఉదయం 6:50 గంటలకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభం కానుంది. జనవరి 9న ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగింపు జరుగనుంది.