సెమీస్ లో ఆన్ సుయాంగ్ చేతిలో సింధు ఓటమి
వరంగల్ టైమ్స్, సుచియాన్ : కొరియా ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ లో పీవీ సింధు ఓటమి పాలైంది. నేడు జరిగిన సెమీస్ లో ఆన్ సుయాంగ్ చేతిలో సింధు ఓటమి అయింది. 14-21, 17-21 స్కోర్ తేడాతో సెమీస్ లో సింధు ఓడిపోయింది. గతంలో ఆన్ సుయాంగ్ 3 సార్లు సింధుపై గెలిచింది. ఇప్పుడు నాలుగోసారి కూడా సింధుపై ఆన్ సుయాంగ్ ఆధిపత్యం కొనసాగింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ -500 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం మూడో సీడ్ సింధు 21-10, 21-16 తో బుసానన్ ఓంగ్ బమ్రున్ ఫాన్ ( థాయ్ లాండ్)పై అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే.