హనుమకొండ జిల్లా : ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, అర్జున అవార్డు గ్రహీత జమ్మలమడక పిచ్చయ్య మరణం క్రీడాకారులకు తీరనిలోటని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అర్జున జె పిచ్చయ్య నిన్న మృతి చెందడం పట్ల చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సోమవారం జెఎన్ఎస్ స్టేడియంలో పిచ్చయ్య పార్థీవదేహానికి దాస్యం వినయ్ భాస్కర్ నివాళులర్పించారు. అనంతరం వినయ్ భాస్కర్ పిచ్చయ్య క్రీడాస్ఫూర్తి గురించి మాట్లాడారు. పిచ్చయ్య మరణం దేశ వ్యాప్తంగా క్రీడాకారులను ద్రిగ్భాంతికి గురి చేస్తుందని అన్నారు.
పిచ్చయ్య వరంగల్ నగరానికి చెందిన వారు కావడం మాకు గర్వ కారణం అని అన్నారు. వారి మృతితో క్రీడాకారులతో పాటు మా అందరికీ తీరని లోటులాంటిదని తెలిపారు. పిచ్చయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.