కేయూకి ఐటీశాఖ నోటీసులు జారీ!
వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీకి ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీ గత మూడేళ్ళుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయట్లేదు. ఐటీశాఖ పలుసార్లు నోటీసులు ఇచ్చినా యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఫైనల్ గా నోటీసులు జారీ చేశారు. రూ. 200 కోట్లకు డిమాండ్ నోటీసు కాగా, రూ.40 కోట్లు చెల్లించాలని లేకుంటే యూనివర్సిటీ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తామని డిమాండ్ నోటీస్ పంపించినట్లు సమాచారం.