న్యూఢిల్లీ : దేశంలో ఈ సంవత్సరం అత్యధిక స్థాయిలో వర్షాపాతం నమోదైంది. సెప్టెంబర్, అక్టోబర్ లో ఈ యేడాది 125 సార్లు అతిభారీ వర్షాలు కురిసినట్లు భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 5 యేండ్లలో ఇలాంటి వర్షాలు చోటుచేసుకోవడం రికార్డు. సెప్టెంబర్ , అక్టోబర్ లలో వాతావరణం విపరీతంగా ప్రవర్తించడానికి గల కారణాలను కూడా ఐఎండీ వెల్లడించింది.
నైరుతీ రుతుపవనాలు ఆసల్యంగా వెనుదిరగడంతో పాటు సాధారణ పీడనం కన్నా అధిక స్థాయిలో రుతుపవనాలు ఉండటం వల్ల ఇలాంటి వర్ష ఘటనలు చోటుచేసుకున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇక నవంబర్ లో కురవబోయే వర్షాల గురించి కూడా ఐఎండీ నేడు రిపోర్ట్ ను విడుదలచేసింది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానం, తమిళనాడు, పుదుర్చరి , కరైకల్ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.