సచిన్ పాదాలను తాకిన జాంటీ రోడ్స్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : మాజీ క్రికెటర్ సచిన్ పట్ల ఉన్న గౌరవాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ చాటుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాదాలకు జాంటీ రోడ్స్ వందనం చేశారు. ఈ ఘటన బుధవారం ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్నది. జాంటీ రోడ్స్ ప్రస్తుతం పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు.ఇక ముంబై జట్టుకు సచిన్ మెంటర్ గా ఉన్నారు. బుధవారం మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ప్లేయర్లతో పాటు సిబ్బంది కూడా ఒకరిని ఒకరు విష్ చేసుకున్నారు. ఈ సమయంలో సచిన్ పాదాలను మొక్కేందుకు జాంటీ రోడ్స్ ప్రయత్నించాడు. ముంబై ఇండియన్స్ ఆ మ్యాచ్ లో ఓడిన విషయం తెలిసిందే.