న్యూయార్క్ : అమెరికా కొత్త అధ్యక్షుడు జోబైడెన్ కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో 78 సంవత్సరాల వయస్సు గల బైడెన్‌కు ఫైజర్ టీకా ఇచ్చారు. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాన్ని అమెరికా చానళ్లు లైవ్ ప్రసారం చేశాయి. అమెరికన్లలో కరోనా టీకా పట్ల ఉన్న భయాలను తొలగించేందుకే బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకున్నటులు బైడెన్ తెలిపారు. టీకా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి యూఎస్‌లో టీకా పంపిణీకి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలోనే వ్యాక్సిన్‌పై ఉన్న ఆపోహాలను తొలగించేందుకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకుంటానని వెల్లడించారు. ఇందులో భాగంగానే బైడెన్ సోమవారం టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు అమెరికాలో 17.5 మిలియన్లకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. 3.15 లక్షల మంది మృతిచెందిన విషయం తెలిసిందే.