హైదరాబాద్: విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో, హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు”. డిసెంబర్ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రం పరిపూర్ణంగా థియేటర్స్ ఓపెన్ కాని నేపథ్యంలో జనవరిలో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. ‘రీసెంట్ గా విడుదలైన మా కళాపోషకులు ట్రైలర్ కి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. రోజు రోజుకీ వ్యూస్ పెరిగిపోతున్నాయి. దీంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ముందు అనుకున్నట్టుగానే మా చిత్రాన్ని డిసెంబర్18న విడుదల చేయాలని ప్లాన్ చేశాం.. కానీ ఫుల్ ప్లేడ్జెడ్ గా థియేటర్స్ ఓపెన్ కాని కారణంగా ‘కళాపోషకులు’ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.. సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’అని నిర్మాత యం. సుధాకర్‌రెడ్డి అన్నారు. విశ్వకార్తికేయ, దీప ఉమాపతి జంటగా నటించిన ఈ చిత్రంలో భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్, చిట్టిబాబు నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్: కళ్యాణ్ సమి, ఎడిటర్: సెల్వ కుమార్, సంగీతం: ఎలేందర్ మహావీర్, పీఆర్ఓ: సాయి సతీష్, నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎం. స్క్రీన్ ప్లే-డైలాగ్స్- డైరెక్షన్ : చలపతి పువ్వల