వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ప్రముఖ వ్యాపార వాణిజ్యవేత్త,రాజ్యసభ మాజీ సభ్యులు,పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి, దేశ వ్యాపార వాణిజ్య రంగానికి రాహుల్ బజాజ్ చేసిన కృషి గొప్పదన్నారు. బజాజ్ స్కూటర్ వంటి ఉత్పత్తులు దేశ ప్రజాజీవనంలో భాగస్వామ్యం అయ్యాయన్నారు. “హమారా బజాజ్” అనేది వ్యాపార వాణిజ్య నినాదమే అయినప్పటికీ, అది భారత జాతిని, ఉత్పత్తిరంగంలో స్వీయ అస్తిత్వ విధానం దిశగా చైతన్యపరిచిందని సీఎం అన్నారు. రాహుల్ బజాజ్ సామాజిక బాధ్యత కలిగిన జాతీయవాద వ్యాపారవేత్తగా సీఎం పేర్కొన్నారు. రాహుల్ బజాజ్ మరణం, దేశీయ పారిశ్రామిక రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Home News