వరంగల్ టైమ్స్, యాదాద్రి-భువనగిరి జిల్లా : నేడు యాదాద్రి-భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రికి చేరుకుని ప్రెసిడెన్షియల్ సూట్స్ లను ప్రారంభించనున్నారు. 12 గంటల 30నిమి.లకు యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ సందర్భంగా కొండ కింద చేపట్టే మహా సుదర్శన యాగం కోసం యాగశాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భువనగిరిలో నూతనంగా నిర్మించిన యాదాద్రి సమీకృత కలెక్టరేట్ ప్రారంభించనున్నారు. భోజనం అనంతరం అధికారులతో మధ్యాహ్నం 3 గంటల వరకు సీఎం సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 : 30 గంటలకు భువనగిరి పక్కనే ఉన్న రాయగిరి వద్ద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ భారీ బందోబస్తు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Home News