ఏప్రిల్ 14న కేజీఎఫ్ చాప్టర్ 2, మార్చి 27న ట్రైలర్
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ (KGF Chapter2 ). పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ, క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’KGF Chapter1 పాన్ ఇండియా రేంజ్ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను ఇప్పుడే ఎవరూ మరచిపోలేం. ఈ దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలను మించేలా భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, హై టెక్నికల్ వేల్యూస్‌తో KGF Chapter2 సినిమాను రూపొందించారు మేకర్స్.‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే హోంబలే ఫిలింస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటననను వెలువరిచారు. మార్చి 27 సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది. చాలా సినిమాలు ట్రైలర్స్ వచ్చేశాయి. కానీ తమ అభిమాన హీరో ట్రైలర్ రాకపోయినా ఫ్యాన్స్ చాలా నమ్మకంతో, ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేశారు. హోంబలే ఫిలింస్ వారి నిరీక్షణకు తెర దించుతూ ప్రకటనను ఇచ్చింది.
అదే సమయంలో ఇతర సినిమాల రిలీజ్ సమయంలో KGF Chapter 2 ట్రైలర్‌ను ప్రదర్శిస్తారంటూ వచ్చిన వార్తలను నిర్మాణ సంస్థ తోసిపుచ్చింది. అభిమానులు కోరుకున్నట్లే మేకర్స్ ఓ స్పెషల్ డేట్ రోజున ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇతర సినిమాలతో క్లాష్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు.