నర్సంపేట లో కేటీఆర్ కార్యక్రమాలు
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ మహానగర పర్యటనలో భాగంగా మంత్రి కేటిఆర్ నర్సంపేటలో గంట పాటు సమయాన్ని వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ లో మధ్యాహ్నం 12.30 గంటలకు దిగనున్న కేటీఆర్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నర్సంపేట మున్సిపాలిటీ ఆవరణలో ఒకే చోట మెప్మ పరిపాలన భవనం, లైబ్రరీకి, చెన్నరావు పేట, దుగ్గొండి మహిళా సమాఖ్య భవనాలకు కెటిఆర్ ప్రారంభోత్సవాలు చేస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నర్సంపేటలో మీడియా సమావేశంలో వెల్లడించారు.రాష్ట్రంలో మొదటి సారిగా ఇంటింటికీ పైపుల ద్వారా వంట గ్యాస్ లను సరఫరా చేసే మెఘా పైప్ డ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్టును కేటీఆర్ ప్రారంభిస్తారు.
ముందుగా నర్సంపేట నియోజకవర్గానికి విస్తరించాక, ఇదే ప్రాజెక్టు నుంచి వరంగల్ నగరానికి కూడా గ్యాస్‌ను సరఫరా చేయనున్నారు. అనంతరం నర్సంపేటలో జరిగే సభలో మహిళలకు అభయ హస్తం నిధుల వాపస్ ఇస్తారు. అలాగే స్త్రీ నిధి నిధులను పంపిణీ చేస్తారు. గతంలో 550 మంది క్రీడాకారిణులు పాల్గొన్న 9 రకాల గ్రామీణ క్రీడా పోటీల విజేతలకు కెటిఆర్ బహుమతులు అంచేస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నర్సంపేటలో మీడియాకు వివరించారు.