హైదరాబాద్: గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 44,376 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92,22,217కు పెరిగాయి. వైరస్ ప్రభావంతో మరో 481 మంది కొత్తగా మృతి చెందగా.. ఇప్పటి వరకు 1,34,699 బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ చెప్పింది. గత 24గంటల్లో 37,816 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 86,42,771 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 11,59,032 కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 13,48,41,307 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.