ముంబయి : ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం కొంత మెరుగుపడిందని డాక్టర్లు ప్రకటించారు. ఐతే ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు. తీవ్ర అనారోగ్యానికి గురైనర లతా మంగేష్కర్, గత కొన్ని రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్లు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.
లతా మంగేష్కర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని డాక్టర్ ప్రతీత్ సామ్ దాని చెప్పారు. ఐతే ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 11న ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు పరీక్షించి న్యుమోనియా ఉందని తేల్చారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.