జూన్ 5 కాదు జూన్ 1 తేది నుంచే రుతుపవనాలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటంతో పాటుగా వేడి గాలులు తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నది. దీంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తే వాతావరణం కాస్త చల్లబడుతుంది.
అయితే రుతుపవనాలు దేశంలోకి జూన్ 5 తరువాత ప్రవేశిస్తాయని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం రుతుపవనాలు జూన్ 5 వ తేదీన కాకుండా జూన్ 1 వ తేదీనే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించబోతున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇది చల్లని వార్తే అని చెప్పాలి. వాతావరణంలో రోజు రోజుకు అనూహ్యమైన మార్పులు సంభవిస్తుండటంతో అనుకున్న సమయానికే రుతుపవనాలు ప్రవేశిస్తుండటం విశేషం.