సత్ఫలితాలను అందిస్తున్న వరంగల్ సీపీ ముందుస్తు ప్రణాళికలు
క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్న సీపీ డా.తరుణ్ జోషి.వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : మేడారం జాతరను పురస్కరించుకుని ట్రాఫిక్ సెక్టార్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోసి ముందుస్తుగా తీసుకున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ అధికారులతో, సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యలతో వాహనాలలో తరలివచ్చి మేడారం త్వరితగతిన చేరుకుంటుండటంతో భక్తులు తమ సంతోషాన్ని వ్యక్త చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయమనే సమస్య రాకుండా పోలీసులు చేపట్టిన చర్యలతో భక్తులతో పాటు పోలీసులు సైతం ఊపిరి తీసుకుంటున్నారు. తిరుగు ప్రయాణం సైతం భక్తులు ఎలాంటి ఆలస్యం లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో భక్తులు అనందం వ్యక్తం చేస్తున్నారు.