ఆదిలాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎంఐఎం పార్టీ నేత జరిపిన కాల్పుల ఘటనపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. కాల్పులకు పాల్పడిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్‌ను జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తొలగించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే విధంగా వ్యవహరించే ఎంతటి వారినైనా సహించేది లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు ప్రకటించారు.