శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ప్రపంచానికి ఆదర్శప్రాయులన్నారు. శ్రీరామ నవమిని ప్రజలు భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ సీతా రాముల కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.శ్రీరాముడు తన జీవితమంతా ధర్మం కోసం నిలబడ్డాడని, అందుకే ఆయన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడని చెప్పారు. అందువల్ల రామాయణం నిత్య పారాయణ కావ్యంగా మారిందన్నారు.