వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి వెళుతూ మార్గ మధ్యంలో మొరిపిరాల గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్లను, పలు గ్రామ అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. సీసీ రోడ్లు నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా? మిగతా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? వంటి అంశాలను గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
సీసీ రోడ్ల తో పాటు మురుగునీటి కాలువలు, మిషన్ భగీరథ మంచినీరు గ్రామంలో ప్రతి ఒక్కరికీ అందే విధంగా చూడాలని గ్రామ సర్పంచ్ కి చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందాలని రాక పోతే అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగి తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతీ ఒక్కరి బాగు కోసం పని చేస్తున్నదని మంత్రి ప్రజలకు తెలిపారు.