హైదరాబాద్ : నగరంలో నూతనంగా నిర్మించిన ఓవైసీ-మిధాని ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా ఈ ఫ్లైవర్ ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ మొత్తం పొడవు 1.36 కిలోమీటర్లు కాగా, 12 మీటర్ల వెడల్పుల్లో 3 వరుసలుగా నిర్మించారు. ఓల్డ్ సిటీ నుంచి ఎల్బీనగర్ వైపునకు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. మిధాని-డీఎంఆర్ఎల్ కూడళ్ల మధ్య వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఎస్ఆర్డీపీ పథకం కింద రూ.63 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు.
Home News