కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యే చల్లా
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి, వారి ఆత్మగౌరవాన్నిపెంచిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలు మరియు విలీన గ్రామాలకు చెందిన 72 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.72 లక్షలపైగా చెక్కులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందచేశారు. ఆడబిడ్డలకు మేనమామలాగా రూ.100116 /- అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.త్వరలో అర్హులైన ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ను అందించనున్నట్లు తెలిపారు. ఇక బీజేపీ పార్టీ మోసపూరితమైన మాటలు నమ్మొద్దని , ఆ పార్టీ విష ప్రచారంను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే చల్లా లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగెం, గీసుగొండ మండల ప్రజాప్రతినిధులు, విలీన గ్రామాల కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.