వరంగల్ టైమ్స్ ,కరీంనగర్ జిల్లా: కరీంనగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ లోని స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని కవిత అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ అద్భుతంగా స్వామి వారి వేడుకలని నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ కూడా తిరుపతిలో మాడ వీధులు ఉన్నట్టుగానే ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. స్వామి వారి అనుగ్రహం తెలంగాణ పై ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
Home News