హైదరాబాద్ : ఇటీవల వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డితో కలిసి ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి లను అభినందించారు.