బాలబ్రహ్మేశ్వరుడికి కవిత ప్రత్యేక పూజలు
వరంగల్ టైమ్స్, మహబూబ్ నగర్ జిల్లా : ఆలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జోగులాంబ ఆలయాన్ని సందర్శించిన కవితకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాల బ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్సీ కవితకు స్వామి వారి ఆశీర్వచనాలు అంచేశారు అర్చకులు. జోగులాంబ ఆలయంలో మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత వెంట ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్ ఛైర్మన్లు మేడె రాజీవ్ సాగర్, సాయిచంద్ లు ఉన్నారు.