నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు

నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు

వరంగల్ టైమ్స్, కడప జిల్లా : వివేకా హత్య కేసులో నేడు హైదరాబాదులో జరిగే సీబీఐ విచారణకు తాను హాజరు కాలేకపోతున్నానని కడప ఎంపి అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేకపోతున్నానని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

అయితే దీనిపై ఇంతవరకు సీబీఐ అధికారులు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ రోజు వేంపల్లి మండలంలో గృహసారథుల కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఎంపి అవినాష్ రెడ్డి తెలిపారు. వేంపల్లి మధు రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపి సమావేశం జరగనుంది. ఈరోజు కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో సీబీఐ విచారణకు ఎంపి తండ్రి భాస్కర్ రెడ్డి హాజరయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.