వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులకు గురవుతున్న చిన్నకారు, పవర్ లూమ్స్ నడుపుతున్న వారి బాధలను కేంద్ర జౌలి శాఖా మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్ళినట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హ్యాండ్ ల్యూమ్ (రిజర్వేషన్ మరియు సరుకుల ఉత్పత్తి) చట్టం 1985 ప్రకారం చిన్నకారు పవర్ ల్యూమ్ ఆచట్టంలో ఉదహరించబడిన సరుకులను ఉత్పత్తి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ఉన్నందున, చాలా మంది చిన్నకారు పవర్ ల్యూమ్ సంస్థల అధికారుల వేధింపులకు గురి అవుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లటం జరిగినట్లు పేర్కొన్నారు. అదేవిధముగా ఈ చట్టం ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అనుసరించబడుట వలన తెలంగాణ సంస్థలు ఎక్కువ నష్టపోతున్నాయి. కావున ప్రస్తుత పరిస్థితులను అనుసరించి ఈ చట్టంలో తగు మార్పులు చేయాల్సిందిగా ఎంపీ కోమటి రెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
Home News