ఎన్95 మాస్క్ ప్రత్యేకత తెలుసా..?
వరంగల్ టైమ్స్,హెల్త్ డెస్క్ : కరోనా నేపధ్యంలో మనం వాడతున్న సాదారణ మాస్కులు రెండు, మూడు రోజులకు మించి ఉపయోగించలేము. అంతే కాకుండా అవి అంత ఖచ్చితంగా కరోనాను అడ్డుకుంటాయి అని ఖచ్చితంగా కూడా చెప్పలేము. కానీ కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా సిఫారసు చేస్తున్న మాస్కుల్లో ఎన్95 ప్రముఖంగా చెప్పుకోదగినది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మాస్కుల ధరలు అమాంతం పెరగిపోవడమే కాకుండా మాస్కులు మార్కెట్లో అందుబాటులో ఉండడంలేదు.అయితే ఎలాగోలా కష్టపడి సంపాదించిన ఎన్95 మాస్కులు కూడా కొద్ది రోజులు వాడుకునే సౌలభ్యమే ఉంది. కానీ ఈ ఎన్95 మాస్కులు కూడా మళ్ళీ మళ్ళీ వాడేందుకు పలు అధ్యయన సంస్థలు మార్గాలను చెబుతున్నాయి. ఏసీఎస్ నానో జర్నల్‌లో పొందుపరిచిన అధ్యయనాల ప్రకారం ఈ ఎన్95 మాస్కులను 85 డిగ్రీల వద్ద కనీసం 20 నిమిషాల పాటు వేడి చేసి తిరిగి వాడుకోవచ్చని తెలిపారు.
ఇలా వేడి చేస్తూ 50 సార్లు ఈ మాస్కును వినికయోగించుకునే అవకాశం ఉందని పరిశోదకులు తెలిపారు. మరి ఇంకా ఆలస్యం ఏందుకు రేపటి నుంచి ట్రై చేయండి. మాస్క్ ధరించి, కరోనా వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండండి.