హీరో సిద్ధార్థ్ కు మహిళా కమిషన్ షాక్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హీరో సిద్ధార్థ్ కు జాతీయ మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం ట్విట్టర్ ఇండియాకు లెటర్ ను కూడా రాసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషిగా, అవమాన పరిచే విధంగా ఉన్నాయని లెటర్ లో పేర్కొంది.మహిళా కమిషన్ చైర్మ పర్సన్ రేఖా శర్మ, సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ముంబై డీజీపీని ఆదేశించింది. సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల పంజాబ్ లో ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. దీనికి అనుచితమైన రీతిలో సిద్ధార్థ్ రిప్లై ఇచ్చారు. గతంలో కూడా ఇలాగే బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై కూడా విమర్శలు చేశారు. అయితే ఈ ట్వీట్ పై మహిళలు కూడా మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిం