తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి కొలువులు

తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి కొలువులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : పోలీసు శాఖలో మరోసారి కొలువుల జాతర మొదలైంది. ఆ శాఖలో భారీగా ఖాళీలున్నట్లు సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. 18,334 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత యేడాది వరకు పోలీసు శాఖలో 31,972 ఉద్యోగ నియామకాలు చేపట్టారు. తాజాగా 18,334 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం ప్రకటించారు.2013-2014లో పోలీసు శాఖలో మొత్తం 63,181 మంది ఉద్యోగులుండగా, 2019-2020 నాటికి వీరి సంఖ్య 86,829 కి పెరిగింది. ప్రస్తుతం ప్రకటించిన నియామకాలు భర్తీ అయితే ఈ సంఖ్య లక్షకు పైగా చేరుకోనుంది. పోలీసు శాఖలో భారీగా ఖాళీలుండటంతో ఆ పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే వారు ఆ ఉద్యోగానికి కావాల్సిన ప్రిపరేషన్ ను మొదలుపెట్టారు.