సీఎం జగన్ ను కలిసిన నూతన వీసీలు
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో నూతనంగా నియమితులైన పలు యూనివర్శిటీల వైస్ చాన్స్‌లర్‌లు సీఎం వైఎస్ జగన్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంని కలిసిన వారిలో కడప డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ వీసీగా నియమితులైన బానోత్ ఆంజనేయ ప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) గురజాడ, విజయనగరం వీసీ కే.వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఒంగోలు వీసీ మారెడ్డి అంజిరెడ్డిలు ఉన్నారు.
వీరికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో నూతన వీసీలతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కే.హేమచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.