ఉదయ్‌పూర్: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, వెంకట చైతన్య వివాహ వేడుకలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. రెండు రోజుల ముందే మెగా ఫ్యామిలీ ఉదయ్పూర్కోటకు చేరుకున్నారు. ఇప్పటికే వివాహ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత రాత్రి జరిగిన సంగీత్ వేడుక ఫోటోలు , వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక, చైతన్య జంట చిరంజీవి నటించిన బావగారూ.. బాగున్నారా.. సినిమాలోని ఆంటీకూతురా అమ్మో అప్సరా పాటకు ఫుల్ జోష్‌తో స్టెప్పులేసి అలరించారు. ఈ వీడియా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో వివాహం జరుగనుంది. 11న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్హాల్లో వివాహ రిసెప్షన్ జరుపనున్నారు. ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లో ఉన్న చిరు తన ట్విట్టర్ ద్వారా కాబోయే దంపతులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు అంటూ ట్వీట్ చేశారు.