వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: యాజమాన్య కోటా బీహెచ్ఎంఎస్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కాలేజీలలోని యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. నీట్-2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత దరఖాస్తుల పరిశీలన, ఆప్షన్ల నమోదుకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.