7వ రోజు భద్రకాళికి లక్ష తెల్లచామంతులతో పుష్పార్చన
వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్రి మహోత్సవములు శుక్రవారంకి ఏడవ రోజుకు చేరుకున్నాయి. 7వ రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం వసంత నవరాత్ర కల్పాన్ని అనుసరించి జరుపాల్సిన విశేష పూజారాధనలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి లక్ష తెలుపు రంగు చామంతి పూలతో అర్చన చేశారు. లక్ష పుష్పార్చన నిర్వహణకు జరుపాల్సిన పూజాదికములు నిర్వహించిన పిమ్మట బ్రాహ్మణోత్తములందరూ అమ్మవారికి లక్ష పుష్పార్చన జరిపారు. వివిధములైన భోగములతో మహా నివేదన జరిపి నీరాజన మంత్ర పుష్పముల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిపారు.