ఇంటర్ ఎగ్జామ్స్.. నిమిషం లేటైనా నో ఎంట్రీ
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐతే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించమని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. ఈ సూచనను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలన్నారు. కొవిడ్, ఎండలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఫలితాలు వచ్చిన నెల రోజుల్లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 1,443 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్షల సమయం..
మొదటి సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి మే 23 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.మొదటి సంవత్సరం షెడ్యూల్
మే 6న – సెకండ్ లాంగ్వేజ్
మే 9న – ఇంగ్లీష్
మే 11న – మ్యాథ్స్ -ఏ, వృక్ష శాస్ట్రం, పొలిటికల్ సైన్స్
మే 13న – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 16న – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 18న – కెమిస్ట్రీ, కామర్స్
మే 20న – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1
మే 23న – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
ద్వితీయ సంవత్సరం షెడ్యూల్
మే 7న – సెకండ్ లాంగ్వేజ్
మే 10న – ఇంగ్లీష్
మే 12న – మ్యాథ్స్ -ఏ, వృక్ష శాస్ట్రం, పొలిటికల్ సైన్స్
మే 14న – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 17న – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19న – కెమిస్ట్రీ, కామర్స్
మే 21న – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
మే 24న – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి