హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి పథకం సాధించిన ప్రగతినంతా కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తన పచ్చా పచ్చని పల్లె అనే గ్రంథంలో నిక్షిప్తం చేశారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
గౌరీ శంకర్ సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసి తన పచ్చా పచ్చని పల్లె పుస్తకాన్ని అందచేశారు. పుస్తకం స్వీకరించిన మంత్రి సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయన్నారు. గ్రామీణ భారత చరిత్రలో మన పల్లెలు ఊహించని విధంగా సాధించిన పురోగతికి ఈ పుస్తకం నిదర్శనమన్నారు. పల్లెలను ఆధునీకరించుకుంటూ, పల్లెల పునర్నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. రచయిత గౌరీ శంకర్‌ను మంత్రి అభినందించారు.