వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి 8 వ తేదీ వరకు నిర్వహించే శానిటేషన్ డ్రైవ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. వరంగల్ అర్బన్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 47వ డివిజన్ గోకుల్ నగర్ లో శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు.ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, అడిషనల్ కలెక్టర్ దయానంద్, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి లు గోకుల్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గోకుల్ నగర్ లోని పరిసరాలను స్వయంగా పరిశుభ్రపరుస్తూ , ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.
కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నాశనం చేయాలంటే శానిటేషన్ డ్రైవ్ లో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నల్లా స్వరూపరాణి, సుధాకర్ రెడ్డి, ఎం.హెచ్.ఓ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.