న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకొని, సైనికుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో అందరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించారు.