వరంగల్ టైమ్స్ , కృష్ణాజిల్లా : రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి పై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఎటువంటి పోలీసు అనుమతి లేదన్నారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. కరోనా కేసుల ఉద్ధృతినీ దృష్టిలో పెట్టుకొని,144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడే నేపథ్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలా కాకుండా ఆదేశాలను మీరి ప్రజలు అధిక సంఖ్యలో ఒకచోట కూడి విజయవాడ వెళ్లి నిరసన తెలపాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.