మార్చి 4 నుండి పోలీస్ క్రీడలు ప్రారంభం
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 4 నుండి 6 వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ అండ్ మీట్ – 2022 నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ప్రకటించారు. నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు ఆటవిడుపుగా ప్రతీ యేడాదికి ఒకసారి నిర్వహించే వరంగల్ పోలీస్ క్రీడలను ఈ యేడాది కూడా నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ కమిషనరేట్ పోలీసులకు క్రీడలను నిర్వహిస్తున్నట్లుగా సీపీ తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలు ఈ నెల 4న హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నందు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ క్రీడా పోటీల్లో వివిధ క్రీడాంశాల్లో డివిజనల్ వారిగా పోలీస్ అధికారులు, సిబ్బంది పోటీ పడనున్నారని తెలిపారు.ఈ క్రీడల్లో సెంట్రల్, ఈస్ట్ , వెస్ట్ జోన్ల పాటు, సిటీ ఆర్మూడ్ విభాగం, ట్రాఫిక్, సీసీఆర్ బి, స్పెషల్ బ్రాంచ్, ఐటీ మరియు సైబర్ విభాగాలకు చెందిన పురుష, మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. ఈ క్రీడల ముగింపు వేడులకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా హాజరు కానున్నట్లు సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు. ఈ క్రీడలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని. ఈ పోటీల్లో పోలీస్ క్రీడాకారులు ఉత్సహంగా పాల్గొని ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయగలరని వరంగల్ సీపీ పిలుపునిచ్చారు.