కరోనా జాగ్రత్తలు తెలిపిన ప్రభాస్
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు , సినిమా ప్రేక్షకులకు కరోనా జాగ్రత్తలు తెలిపాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అభిమానులకు , ప్రేక్షకులకు డార్లింగ్ ప్రభాస్ సూచించారు.
బిగ్ స్క్రీన్ లో సినిమాను ఎంజాయ్ చేసేటప్పుడు కరోనా నుంచి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అందులో ముఖ్యంగా మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని ఆయన కోరారు. దీనికి సంబంధించిన 16 సెకన్ల వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.