హైదరాబాద్ : గత 8 రోజులుగా కరోనాతో హోం ఐసోలేషన్ లో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు కోలుకున్నారు. నేడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ప్రిన్స్ మహేష్ బాబుకు కరోనా నెగిటివ్ గా రిపోర్టు వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడక పోయినా, మొత్తానికి మహేష్ బాబు కోలుకున్నారని పక్కా సమాచారం అయితే ఉంది. జనవరి 6న మహేష్ బాబు కరోనా బారినపడ్డారు. ఆయన కరోనా బారిన పడిన అనంతరమే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు దూరమయ్యారు.
Home Cinema