హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల పదోన్నతి ప్రక్రియ పూర్తయ్యింది. 120 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారుల నుంచి సెక్షన్ అధికారులుగా పదోన్నతి పొందారు. 33 మందికి సహాయ కార్యదర్శులుగా , 20 మందికి ఉపకార్యదర్శులుగా 8 మందికి సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది.
అలాగే నలుగురు జాయింట్ సెక్రెటరీలు, అడిషనల్ సెక్రటరీలుగా పదోన్నతి పొందారు. బుధవారం పదోన్నతికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 3 రోజుల ఢిల్లీ పర్యటనకు వెల్లే ముందు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. న్యాయపరమైన అంశాల వివాదాల్లో లేని 120 మందికి పదోన్నతులు కల్పించారు.