హైదరాబాద్ : సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి స్వర్గం శ్రీనివాస్ కు పీసీసీఎఫ్ గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి గా ఉన్న శ్రీనివాస్ కు పదోన్నతి కల్పిస్తూ పీసీసీఎఫ్ (అటవీ రక్షణ, నిఘా విభాగం) అధిపతిగా నియమించారు.