నెల్లూరు జిల్లా : కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01ను పీఎస్ఎల్వీ సీ-50 ద్వారా డిసెంబర్ 17న మధ్యాహ్నం 3:41 గంటలకు నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్నట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ప్రకటించింది. భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉప్రగహం.. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించారు. దీని పరిమితి భారత్తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్లకు విస్తరిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్లో ఇది 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని వెల్లడించింది.